కొత్త సినిమా -కర్మణ్యే వాధికారస్తే..

కొత్త సినిమా -కర్మణ్యే వాధికారస్తే..

బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్‌ మహేంద్ర కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్‌దీప్‌ చల్లపల్లి దర్శకుడు. డీఎస్‌ఎస్‌ దుర్గాప్రసాద్‌ నిర్మించారు. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైం, ఇన్వెస్టిగేషన్‌ సినిమా ఇది. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో సాగుతుంది’ అన్నారు. మంచి ఫిలసాఫికల్‌ పాయింట్‌తో తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సినిమా ఇదని నిర్మాత పేర్కొన్నారు. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: గ్యాని.

editor

Related Articles