‘హిట్’ టాక్‌తో వచ్చిన రెండు సినిమాలు బాగా కలెక్షన్లు రాబట్టాయి. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుండి మూడో సినిమా వస్తోంది. నాని ఇందులో హీరో. ‘హిట్: ది థర్డ్ కేస్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. డా.శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ సినిమాకు చెందిన పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాని ఉద్రేకపూరితంగా కనిపిస్తున్నారు. ఓ ఫైర్ రాడ్‌తో విలన్‌ని కొడుతున్న ఈ పోస్టర్ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. ఇందులో నాని హిట్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రీనిధి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె.మేయర్.

- November 2, 2024
0
39
Less than a minute
Tags:
You can share this post!
administrator