మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘లూసిఫర్’కి సీక్వెల్ రానుంది. ‘ఎల్2 ఎంపురాన్’ పేరుతో తీస్తున్న ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదలవుతుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయని, ఖురేషి అబ్రహమ్‌గా ఇటీవల విడుదల చేసిన మోహన్‌లాల్ ఫస్ట్‌లుక్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. మోహన్‌లాల్ ఇందులో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారని, ఆయనతోపాటు కొందరు సౌత్ స్టార్లు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జయేద్ మసూద్‌గా పృథ్వీరాజ్ నటిస్తున్న ఈ సినిమాలో టివినో థామస్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: దీపక్‌దేవ్.

- November 2, 2024
0
26
Less than a minute
Tags:
You can share this post!
administrator