సాయిపల్లవిని సౌతిండియన్ సూపర్‌స్టార్ అనడంలో తప్పులేదు, అంత ఫాలోయింగ్ ఉంది ఆమెకు. భాషలకూ, ప్రాంతాలకూ అతీతంగా అభిమానులున్నారామెకు. నిజం చెప్పాలంటే హీరోలతో సమానమైన ఇమేజ్ సాయిపల్లవికి ఉంది. రీసెంట్‌గా ‘అమరన్’లో ఇందుగా చాలా బాగా నటించింది సాయిపల్లవి. సినిమాలను ఎన్నుకునే విషయంలోనూ ఈ మలయాళ భామ ఆచితూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘తండేల్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేశభక్తి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. తాజాగా మరో తెలుగు సినిమాకు సాయిపల్లవి సంతకాలు చేసింది. పవన్ సాదినేని డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ఈ సినిమాకు ‘ఆకాశంలో ఒక తార’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ ఏడాది జూలైలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు సాయిపల్లవి ఓకే అయ్యిందని తెలుస్తోంది. సాయిపల్లవికి కూడా కథ బాగా నచ్చిందట. ఈ సినిమా షూటింగ్ నెలాఖరు నుండి ప్రారంభమౌతుందని తెలుస్తోంది.

- November 2, 2024
0
40
Less than a minute
Tags:
You can share this post!
administrator