నిర్మాతగా హీరో నాని సినిమాలలో 100% సక్సెస్ దక్కించుకోవడం విశేషం. హీరోగా మంచి ఇమేజ్ ఉన్న నాని వాల్ పోస్టర్ బ్యానర్ స్థాపించి నాని నిర్మాతగా మారాడు. తన అభిరుచికి తగిన కథల్ని ఎంచుకుని కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్నారు. ‘అ’ లాంటి కథని తెరపైకి తీసుకొచ్చి తనలో ఎంత దమ్ముందో నిరూపించాడు. ప్రశాంత్ వర్మ అనే దర్శకుడిని అ సినిమాతో పరిచయం చేసి ఇండస్ట్రీకి ఓ మంచి దర్శకుడిని కూడా అందించాడు. ఇక నాని నిర్మాణంలో వచ్చిన హిట్ 1, హిట్ 2 సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాల్ని అందించాయి. శైలేష్ కొలను అనే దర్శకుడు ఈ సినిమాలతో తనలోని సత్తా చూపించాడు. ఇక త్వరలో హిట్ 3 చేయబోతున్నాడు. దానికి ముందు కోర్ట్ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు నాని. పరిమిత వనరులతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. సినిమాపై ఎంత నమ్మకం ఉంటే రెండు రోజుల ముందే నాని ప్రీమియర్స్ వేస్తాడు. కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 కూడా చూడకండి అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు నాని. ఎంత ధైర్యం ఉండాలి ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి, అయితే కోర్టు హిట్ అయింది కాబట్టి సరిపోయింది కాని లేదంటే నానిని సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేసేవారు.

- March 14, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor