అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణా హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో మ్యాసీవ్ రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా నార్త్ ఇండియాలో అన్ని భాషల థియేట్రికల్ రిలీజ్ పార్ట్నర్గా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ జాయిన్ కావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, జగపతి బాబు, మహేష్ మాంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ గ్రాండియర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ‘నాగబంధం’ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
- May 21, 2026
0
9
Less than a minute
You can share this post!
editor

