రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ విడుదలైంది. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్‌పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంగా 1897 నుంచి 1920 మధ్య జరిగే కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతానికి భిన్నంగా హింస మార్గాన్ని ఎంచుకున్న డేవిడ్ రెడ్డి పాత్రలో మంచు మనోజ్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. బ్రిటీష్ సైన్యంపై పోరాడే విప్లవకారుడిగా ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతి విజువల్‌లోనూ హై క్వాలిటీ మేకింగ్ కనిపిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం దసరా సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

