మినిస్టర్ నారాయణగా రాజా రవీందర్ పవర్‌ఫుల్ లుక్..!

మినిస్టర్ నారాయణగా రాజా రవీందర్ పవర్‌ఫుల్ లుక్..!

వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘CASTE’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఎకె జంపన్న రచన మరియు దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజా రవీందర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. మంత్రి నారాయణ పాత్రలో రాజా రవీందర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. తెల్లటి దుస్తులు, భుజంపై పార్టీ కండువాతో ఆయన లుక్ ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రంలో కశికా కపూర్, దివి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.

Related Articles