ప్రస్తుతం టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో నాగ చైతన్య, శోభిత జంట ఒకటి. ఇక పెళ్ళైనప్పటి నుండి వీరిద్దరు చాలా సరదాగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించే శోభిత ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన ఫొటోస్ షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ జంట ఆమ్‌స్టర్‌డామ్, మెక్సికోలలో వీధి వీధి తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుండి సాయంత్రం వరకు ఎలా గడిపారో ఫొటోల ద్వారా తన అభిమానులకు తెలియజేసింది. తండేల్ సక్సెస్ తర్వాత నాగచైతన్య, శోభిత దంపతులు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా, ఈ క్రమంలోనే కార్ రేసింగ్ ట్రాక్ వద్ద తమ డేను సరదాగా గడిపారు. చై, శోభిత కలిసి రేసింగ్ ట్రాక్‌లో గడిపిన క్షణాలను శోభిత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా, చైతన్యకి రేసింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే శోభితను సైతం అక్కడకు తీసుకెళ్లారు. ఆమెతో సరాదాగా రేసింగ్ కారు నడిపారు.

- March 15, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor