Movie Muzz

నాని–విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎలాంటి గొడవలు లేవన్న నాగ్ అశ్విన్

నాని–విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎలాంటి గొడవలు లేవన్న నాగ్ అశ్విన్

టాలీవుడ్‌లో తమ అభిమాన హీరోను సపోర్ట్ చేసేందుకు ఫ్యాన్స్ ఏం చేయడానికైనా సిద్ధం. ఇక తమ హీరోను ఎవరైనా కామెంట్ చేస్తే, అవతల ఏ హీరో ఉన్నా అతడిపై నిప్పులు చెరుగుతారు. అయితే, టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడారు. గతంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో నాని, విజయ్ కలిసి ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో నటించారు. అయితే, ఆ సమయంలో నాని, విజయ్‌ల మధ్య మంచి స్నేహం ఉందని.. ఒకరికొకరు ఎలాంటి హెల్ప్ అయినా చేసుకునేవారు అంటూ నాగ్ అశ్విన్ తెలిపారు. ఇక ఇటీవల ‘ఎవడే సుబ్రమణ్యం’ రీ-యూనియన్‌లో ఈ ఇద్దరు హీరోలు కలిసి పాల్గొన్నారు. దీంతో వీరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ఫ్యాన్స్‌కు అర్థమైందని ఆయన తెలిపారు.

administrator

Related Articles