‘మృత్యుంజయ్’ టీజ‌ర్ రిలీజ్

‘మృత్యుంజయ్’ టీజ‌ర్ రిలీజ్

టాలీవుడ్ యువ హీరో శ్రీవిష్ణు బ‌ర్త్‌డే ఈ రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. అత‌డు న‌టిస్తున్న సినిమాల నుండి అప్‌డేట్‌లు విడుద‌ల చేస్తున్నారు నిర్మాతలు. ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని కడుపుబ్బా న‌వ్వించారు విష్ణు – రెబా మోనిక జాన్‌లు. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న తాజా సినిమా మృత్యుంజయ్. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకి హుస్సేన్‌ షా కిరణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. నేడు శ్రీవిష్ణు బ‌ర్త్‌డే ఈ సినిమా టైటిల్ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ చూస్తుంటే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న‌ట్లు తెలుస్తోంది. గేమ్ ఓవ‌ర్, నేను అయిపొయిందనే వ‌ర‌కు అవ్వ‌దు అనే రెండు డైలాగ్‌ల‌తో టీజ‌ర్‌ని క‌ట్ చేశారు నిర్మాతలు. సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో అయ్యప్ప శర్మ, వీర్‌ ఆర్యన్‌, సుదర్శన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతమందిస్తున్నారు. విద్యాసాగర్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

editor

Related Articles