థ‌మ‌న్‌కి ఈ హీరోతో అస్సలు ప‌డదుట…

థ‌మ‌న్‌కి ఈ హీరోతో అస్సలు ప‌డదుట…

త‌న‌కు న‌టుడి సిద్ధార్థ్‌కి అస‌లు ప‌డక‌పోయేద‌ని సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ తెలిపాడు. ‘బాయ్స్’ సినిమా టైంలో త‌న‌కు న‌టుడి సిద్ధార్థ్‌కి అస‌లు ప‌డక‌పోయేద‌ని థ‌మ‌న్ వెల్ల‌డించాడు. ఆది పినిశెట్టి హీరోగా ఈ రోజు వ‌చ్చిన తాజా సినిమా శ‌బ్దం. ఈ సినిమాకి అరివ‌ళ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందించాడు. ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేసింది.. రీసెంట్‌గా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న థ‌మ‌న్ న‌టుడు సిద్ధార్థ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. థ‌మ‌న్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద‌ర్శ‌కుడు అరివ‌ళ‌గ‌న్ నాకు బాయ్స్ సినిమా అప్ప‌టినుంచి తెలుసు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ సార్ న‌న్ను చూసుకోమ‌ని అరివ‌ళ‌గ‌న్‌కి అప్ప‌గించాడు. దీంతో మేమిద్ద‌రం అప్ప‌టినుంచి ఫ్రెండ్స్ అయ్యాం. అయితే ఈ సినిమా టైంలో నాకు సిద్ధార్థ్ గాడికి  అస‌లు ప‌డేది కాదు. వాడికంటే నేనే అప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నా. దీంతో ఒక‌సారి నా ద‌గ్గ‌రికి సిద్ధార్థ్ వ‌చ్చి నేను హీరో అన్నాడు. అయితే ఏంటి నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా అనేవాడిని. అంతేగాకుండా.. సిద్ధార్థ్ కారవాన్‌లో ఉన్న‌ప్పుడు కరెంటు ఆపేసేవాడిని. నీళ్ల పైప్ కట్ చేసి వాడికి నీళ్లు దొరక్కుండా చేసే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

editor

Related Articles