హీరో మహేష్‌బాబు కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మహేష్‌బాబు కొత్త లుక్‌కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళితో పాటు ఈ సినిమా కోసం మహేష్‌బాబు కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పటికే జుట్టు గడ్డం పెంచేసి లుక్స్ మొత్తం మార్చేసిన మహేష్‌బాబు తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నాడు. అయితే మహేష్‌బాబు జిమ్‌లో ఎక్సర్‌సైజ్ అనంతరం అద్దం ముందుకు వెళ్లి తన లుక్‌ని చూసుకుని బయటకు వెళ్లే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో జుట్టు మొత్తం వదిలేసి రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

- February 28, 2025
0
30
Less than a minute
Tags:
You can share this post!
editor