‘గట్ట కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్ ఖరారు

‘గట్ట కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్ ఖరారు

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘గట్ట కుస్తీ-2’ త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 3న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇందులో రమ్యకృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జులై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాని కేవలం తమిళ భాషలో మాత్రమే విడుదల చేసినప్పటికీ, ఓటీటీలో మాత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది.

కాగా, ఈ సినిమా గతంలో విడుదలై విజయాన్ని అందుకున్న ‘మట్టి కుస్తీ’కి సీక్వెల్‌గా తెరకెక్కింది. కామెడీ, స్పోర్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles