దర్శకుడు మణిరత్నం మరోసారి యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల విడుదలైన థగ్ లైఫ్ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, ఈసారి ప్రేమకథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇటీవల కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్‌ను నిశ్శబ్దంగా ప్రారంభించిన చిత్రబృందం, హౌరా బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ను చిత్రీకరిస్తోంది. అక్కడే ఓ అందమైన పాటను కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ సేతుపతిని పూర్తిగా కొత్త లుక్‌లో చూపించేందుకు మణిరత్నం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మీసం, గడ్డంతో కనిపించే విజయ్ సేతుపతి ఈ సినిమాలో క్లీన్ షేవ్ లుక్‌లో యంగ్‌గా కనిపించనున్నారు. సాయి పల్లవితో ఆయన కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా యూత్‌ఫుల్ ప్రేమకథగా తెరకెక్కుతుండగా, మణిరత్నం మార్క్ ఎమోషన్స్, సంగీతం, విజువల్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

