రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా ‘వారణాసి’ గురించి నటి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె, గత 14 నెలలుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నానని తెలిపారు.
“రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో నేను ఎన్నో అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేశాను. ప్రస్తుతం దీనికి మించి వివరాలు చెప్పలేను” అని ప్రియాంక అన్నారు. ఈ సినిమా తాను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికంటే భిన్నంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు.
ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని రాజమౌళి వెల్లడించారు. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తిచేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రమోషన్స్ ప్రారంభించి, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

