తమిళ స్టార్ విజయ్ అభిమానులకు శుభవార్త. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదల తేదీ ఖరారైంది. జులై 23న సినిమాను విడుదల చేయనున్నట్లు ఓ ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ప్రకటించింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మొదట ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. కోర్టు కేసులు, సీబీఎఫ్సీ పునఃపరిశీలన అనంతరం తాజాగా సెన్సార్ పూర్తి అయింది. సినిమాకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి సుమారు 183 నిమిషాలు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, మమితా బైజు కీలక పాత్ర పోషించారు. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విడుదల కానున్న చివరి సినిమాగా ‘జన నాయగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

