జయకృష్ణకు మహేష్‌బాబు స్పెషల్ విషెస్

జయకృష్ణకు మహేష్‌బాబు స్పెషల్ విషెస్

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరోగా జయకృష్ణ ఘట్టమనేని సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాను అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు జయకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్‌బాబు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. తన సోదరుడు రమేష్ బాబు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం కుటుంబానికి ఎంతో ఆనందకరమైన విషయమని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ తనను బాగా ఆకట్టుకున్నాయని, ఈ విజయంలో దర్శకుడు అజయ్ భూపతి కృషి స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు.

అలాగే ఈ సినిమా విడుదల తేదీ తనకు ప్రత్యేకంగా అనిపిస్తోందని మహేష్‌బాబు తెలిపారు. జులై 30నే తన తొలి సినిమా ‘రాజకుమారుడు’ కూడా విడుదలైందని గుర్తు చేసుకున్నారు. అదే తేదీన జయకృష్ణ తొలి సినిమా విడుదల కావడం మంచి సెంటిమెంట్‌గా భావిస్తున్నానని, ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మహేష్‌బాబు విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు జయకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో విజయవంతమైన ప్రయాణం ప్రారంభించాలని కోరుకుంటున్నారు. విడుదలకు ముందే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

Related Articles