టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం ‘ఖూన్‌ఖార్’ పేరుతో హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు.
తాజాగా ఈ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో ఏకంగా 1 బిలియన్ (100 కోట్ల) వ్యూస్ సాధించింది. దీంతో యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్ అందుకున్న తొలి తెలుగు హీరో చిత్రంగా ‘జయ జానకి నాయక’ కొత్త రికార్డు సృష్టించింది.
ఇటీవల ఈ సినిమాలోని ఓ భావోద్వేగ డైలాగ్ సీక్వెన్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వైరల్ కావడంతో సినిమాకు మరోసారి భారీ ఆదరణ లభించింది. ఏడేళ్ల క్రితం విడుదలైనప్పటికీ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో వీక్షణలు రావడం విశేషం. ఈ అరుదైన ఘనతతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఖాతాలో మరో ప్రత్యేక రికార్డు చేరింది.

