గోపీచంద్‌ హీరోగా కొత్త కథతో సినిమా: పూరి జగన్నాథ్?

గోపీచంద్‌ హీరోగా కొత్త కథతో సినిమా: పూరి జగన్నాథ్?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన కూడా రాబోతోందని తెలుస్తోంది. అన్నట్టు వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి పూరి జగన్నాథ్ – బాలయ్య కలయికలో సినిమా వస్తోంది అంటూ బాగా ప్రచారం జరిగింది. ఐతే, ప్రస్తుతం పూరి – గోపీచంద్ కాంబినేషన్‌లో సినిమా వస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. అన్నట్టు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, గోపీచంద్ కోసం ఎలాంటి కథను రాశాడో వేచి చూడాలి.

editor

Related Articles