సినీ హీరో మంచు మనోజ్ తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ జల్లికట్టు వేడుకలలో పశువులను అందంగా అలంకరిస్తూ ఊరంతా ఊరేగింపుగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవడంపై హీరో మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. పోలీస్ వారు లా అండ్ అర్డర్ విషయంలో చాలా కేరింగ్‌గా ఉన్నారు. దీనిలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.

- February 17, 2025
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor