మోహ‌న్‌బాబు బ‌ర్త్ డే స్పెష‌ల్.. కన్న‌ప్ప‌ గ్లింప్స్ రిలీజ్..!

మోహ‌న్‌బాబు బ‌ర్త్ డే స్పెష‌ల్.. కన్న‌ప్ప‌ గ్లింప్స్ రిలీజ్..!

టాలీవుడ్ సినిమా స్థాయి పెర‌గ‌డంతో అన్నీ భారీ బ‌డ్జెట్ సినిమాలే రూపొందుతున్నాయి. ఆ వరుసలో క‌న్న‌ప్ప సినిమా కూడా ఒక‌టి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రలు పోషిస్తుండ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. సినిమా నుండి తొలుత వచ్చిన టీజర్‌పై ట్రోల్స్ రాగా, ఇటీవ‌ల రిలీజ్ అయిన టీజర్, పాటలతో ఈ ట్రోలింగ్ ఆగిపోయింది. ఏప్రిల్ 25న రిలీజ్ కానుండ‌డంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్ర‌మంలోనే నేడు మోహ‌న్‌బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా గ్లింప్స్ విడుద‌ల చేశారు. సినిమా నుంచి మోహన్ బాబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోహన్‌బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్నట్టు అర్ధ‌మైంది. గ్లింప్స్‌లో ‘ఢమ ఢమ ఢమ ఢమ విస్పులింగ.. ధిమి ధిమి ధిమి ధిమి ఆత్మలింగ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అందులో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా పవర్ ఫుల్ లుక్కులో కనిపించి అందరి దృష్టినీ ఆక‌ర్షించారు. ఈ గ్లింప్స్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

editor

Related Articles