మనోజ్ కుమార్‌ క‌న్నుమూత‌.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

మనోజ్ కుమార్‌  క‌న్నుమూత‌.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని కోకిలాబెన్‌ ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు. దేశ భ‌క్తి సినిమాల‌కి ఆయ‌న బాగా ఫేమ‌స్. ఆయన మృతిపై పలువురు నివాళులు అర్పిస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నారు. అలానే కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. 1999లో నటన‌కి దూరం అయ్యారు మ‌నోజ్ కుమార్. ఆయ‌న ఎన్నో అవార్డులు అందుకున్నారు. జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డ్ గ్ర‌హీత అయిన మ‌నోజ్ కుమార్ 1992లో పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. భారతీయ సినిమా, కళలకు ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 2015లో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది.

editor

Related Articles