ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో శంకర్ చేతులకి, కాళ్లకి గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులోకి కూడా పొగ చేరడంతో బాబు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం మార్క్ శంకర్‌ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్‌తో పాటు చిరంజీవి, కొణిదెల సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి అందరు ఆందోళన చెందుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ టీమ్ మార్క్ శంకర్ హెల్త్ అప్ డేట్ విడుదల చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్‌ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు.

- April 9, 2025
0
7
Less than a minute
Tags:
You can share this post!
editor