మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘మిరాయ్’లో విలన్‌గా కనిపించబోతున్నారు. ఇవి కాకుండా హీరోగా ఓ రెండు సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు. కాని అవి మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇప్పుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు మంచు మనోజ్. 90 ఎం.ఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘అత్తరు సాయిబు’ అనే టైటిల్‌తో మనోజ్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. 90 ఎంఎల్ సినిమా తర్వాత శేఖర్ రెడ్డి ఈ కథ మీద వర్క్ చేయగా, ఈ సినిమాని మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ పూజా కార్యక్రమాలు జరగకపోతే ఆరోజు సినిమాను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. టైటిల్ వినగానే ఇది ఏ తరహా సినిమానో మనకు అర్ధం అవుతుంది. ఈ సినిమా. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కథ అని అర్ధమవుతుంది. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో బయటకు వస్తాయి. ఇక భైరవం సినిమాతో త్వరలో పలకరించనుండగా, ఇందులో మనోజ్‌తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. మినీ మల్టీస్టారర్ సినిమాగా ఈ సినిమా రూపొందింది.
- May 9, 2025
0
73
Less than a minute
Tags:
You can share this post!
editor

