స్టేజ్‌పై మ‌నోజ్‌ని చూసి మంచు ల‌క్ష్మి ఏడ్చేసిందట‌..!

స్టేజ్‌పై మ‌నోజ్‌ని చూసి మంచు ల‌క్ష్మి  ఏడ్చేసిందట‌..!

మంచు మనోజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో తన సోదరి మంచు లక్ష్మిని కలిశాడు. వేదికపైన ఉన్న అక్క మంచు లక్ష్మిని వెనుక నుండి వ‌చ్చి స‌ర్‌ప్రైజ్ చేశాడు. అయితే స‌డెన్‌గా మ‌నోజ్‌ని అక్క‌డ చూసిన మంచు ల‌క్ష్మి భావోద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంది. కుటుంబంలో జరుగుతున్న తగాదాల మధ్య మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మి చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఆ స‌మ‌యంలో మ‌నోజ్ భార్య‌.. మౌనికా మంచు ల‌క్ష్మిని ఓదార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అయితే తాజాగా దానికి కార‌ణం తెలియ‌జేసింది. మంచు లక్షి- జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా హాజ‌రు కాగా, ఆ స‌మ‌యంలో మంచు లక్ష్మి మనోజ్‌ని పట్టుకొని ఏడ్చిన వీడియోని ప్లే చేసి దాని గురించి అడిగారు. దానిపై స్పందించిన మంచు ల‌క్ష్మి… నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ నుండి ఎవ్వరూ లేరు. నా లైఫ్‌లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్. సడెన్‌గా వాణ్ణి  అక్కడ చూసేసరికి ఆనందంతో చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. మ‌న చుట్టూ ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ మెయిన్ అంటూ కాస్త ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది మంచు ల‌క్ష్మి. ఇంకా మనోజ్ గురించి, ఫ్యామిలీ గొడ‌వ‌ల గురించి మంచు ల‌క్ష్మి ఏమైన మాట్లాడిందా లేదా అనేది తెలియాలంటే ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్ర‌సార‌మ‌య్యే ఫుల్ ఎపిసోడ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

editor

Related Articles