మలయాళం ఇండస్ట్రీలోని కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ సమ్మెకు పిలుపునిచ్చాయి. కేరళ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో సమ్మెకి దిగుతున్నట్లు ప్రకటించాయి. జూన్ 1 నుండి మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి అన్నీ బంద్ కానునట్లు తెలిపాయి. కరోనా అనంతరం మలయాళం ఇండస్ట్రీకి మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఓటీటీల వలన మలయాళం సినిమాలను ఇతర భాషా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రీసెంట్‌గా మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం, ప్రేమలు వంటి చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే కేరళలో ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ ఎక్కువగా ఉండటం దానికి తోడు జీఎస్‌టీ జత అవ్వడంతో నిర్మాతలు బలౌతున్నారు. అయితే ఇవి చాలవు అన్నట్లు నటులతో పాటు టెక్నీషియన్‌లు భారీ రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనివలన ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ట్యాక్స్‌లతో పాటు నటుల రెమ్యునరేషన్‌ని వ్యతిరేకిస్తూ కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ జూన్ 1 నుండి అన్ని సినిమా షూటింగులు, సినిమాహాళ్లు మూసివేస్తున్నట్లు వెల్లడించాయి. ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేరిస్తే తప్ప సమ్మెని ఆపేది లేదని సంఘాలు తెలిపాయి.

- February 15, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor