రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ నటుడు?

రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ నటుడు?

రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్‌ మొదలైంది. ఈ సినిమాలో వివిధ భారతీయ భాషలకు చెందిన అగ్రతారలతో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ కూడా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా విలన్‌ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తన సినిమాల్లో విలన్‌ పాత్రల్ని అత్యంత శక్తివంతులుగా చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో విలన్‌ క్యారెక్టర్‌ ఎవరనేది అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు.

‘ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అన్నీ ఫైనలైజ్‌ అయ్యాక చిత్రబృందం ఆ వివరాలను మీతో పంచుకుంటుంది’ అని సమాధానమిచ్చారు. దీంతో ఆయన ఈ సినిమాలో విలన్‌ పాత్రను పోషించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రాజమౌళి-మహేష్‌బాబు సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు జాన్‌అబ్రహమ్‌ పేరును కూడా పరిశీలిస్తున్నారని ముంబై సినీ వర్గాల్లో ఒక టాక్ ఉంది.

editor

Related Articles