ఫిబ్రవరిలో Jr.NTR సినిమా షూటింగ్ మొదలు..

ఫిబ్రవరిలో Jr.NTR సినిమా షూటింగ్ మొదలు..

ఎన్టీఆర్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్స్‌ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని తెలిసింది. ఎన్టీఆర్‌ను అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలో టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇదిలా వుండగా ఎన్టీఆర్‌ – హృతిక్‌రోషన్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ ‘వార్‌-2’ సినిమా షూటింగ్‌ కంప్లీట్ అయింది. ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.

editor

Related Articles