SSMB29 | మహేష్‌బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయంపై ఇప్పటివరకూ రకరకాల వార్తలొచ్చాయి. అయితే.. వాటిలో నిజానిజాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందింది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్‌కు రాజమౌళి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని తెలిసింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు, నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు. తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతుందట. సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలుపెట్టి, ఏప్రిల్ వరకూ చిత్రీకరణ జరపుతారని సమాచారం.
తర్వాతి షెడ్యూల్ విదేశాలలో ఉంటుందట. ఈ సినిమా అధికారిక ప్రకటనకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని చిత్రబృందం చెబుతోంది. అనవాయితీ ప్రకారం త్వరలోనే ఓ ప్రెస్‌మీట్‌ను కూడా రాజమౌళి పెట్టనున్నారట. వెయ్యికోట్ల బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా ఈ సినిమాను నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.