గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని స్పెషల్ వీడియో విడుదల చేసింది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. సీఎం భార్యగానే కాకుండా సామాజిక కార్యకర్తగా.. సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌గా రాణిస్తుండటంతో పాటు తనకు సంబంధించిన అప్‌డేట్‌లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అమృత ఫడ్నవీస్ తాజాగా ఒక ప్రయివేట్ ఆల్బమ్‌లో నటించింది. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతిని శనివారం దేశవ్యాప్తంగా జరుపుకోబోతుండగా.. ఈ జయంతిని పురస్కరించుకుని సేవాలాల్‌పై భక్తిని ప్రదర్శిస్తూ ప్రయివేట్ ఆల్బమ్ రుపొందించింది అమృత. మారో దేవ్ బాపు సేవాలాల్ అంటూ వీడియో ఉండగా.. ఈ పాటకు కామోద్ సుభాష్ సంగీతం అందించాడు. అమృతనే ఈ పాటను ఆలపించగా.. నీలేష్ జమ్లాకర్ లిరిక్స్ అందించాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
- February 14, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor

