ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక..!

ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక..!

పవర్ స్టార్ Pawan Kalyan, దర్శకుడు Harish Shankar కాంబినేషన్‌లో తెరకెక్కిన Ustaad Bhagat Singh సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. Mythri Movie Makers నిర్మిస్తున్న ఈ చిత్రంలో Sreeleela, Raashi Khanna కథానాయికలుగా నటిస్తున్నారు.

పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకలో అభిమానుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు అన్నం పెట్టింది సినిమా అని, అదే ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిందని అన్నారు. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఇక తనకు ఒకే ఒక్క హీరో Chiranjeevi అని పవన్ కళ్యాణ్ చెప్పడం అభిమానులను ఆనందపరిచింది. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Related Articles