ఓటిటిలో ఫెయిల్ అయిన “మార్కో”

ఓటిటిలో ఫెయిల్ అయిన “మార్కో”

రీసెంట్‌గా మలయాళ సినిమా నుండి వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమాల్లో హీరో ఉన్ని ముకుందన్ నటించిన మోస్ట్ వైలెంట్ సినిమా “మార్కో” కూడా ఒకటి. దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ సినిమా మలయాళం సహా తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి హిట్ అయ్యింది. అయితే ఒకరోజు ముందే ఓటిటిలో స్ట్రీమింగ్‌కి వచ్చేసిన ఈ సినిమా ఓటిటిలో డిజప్పాయింట్ చేసింది. ఈ సినిమాని చాలామంది అన్ కట్ వెర్షన్‌లో ఆశించారు. కానీ ఆ వెర్షన్ రాలేదు. మరి దీనిపై నిర్మాతలు కూడా వివరణ ఇచ్చారు. తాము కూడా మార్కో అన్‌కట్ వెర్షన్‌లోనే ఓటిటిలో రిలీజ్‌కి తెద్దాం అనుకున్నామని కానీ పలు కారణాల రీత్యా తీసుకురాలేదని తెలిపారు. మరి ఫ్యూచర్‌లో ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించగా సోనీ లివ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

editor

Related Articles