హీరో విజయ్‌కి వై కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

హీరో విజయ్‌కి వై కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

తమిళనాడుకు చెందిన ప్రముఖ హీరో, తమిళ వెట్రి కజగం చీఫ్‌ విజయ్  భద్రత విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు వై+ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విజయ్‌కి 24 గంటల పాటు సాయుధ గార్డులు రక్షణ కల్పిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం భద్రత స్థాయిని నిర్ణయిస్తుంది. వై ప్లస్‌ భద్రత నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. వారిలో ఇద్దరి నుండి నలుగురు కమాండోలు, మిగిలినవారు పోలీసు సిబ్బంది ఉంటారు. విజయ్‌ కాన్వాయ్‌లో ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటాయి. కాగా, స్టార్‌ హీరో అయిన విజయ్‌ దళపతి  గతేడాది రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం  పేరుతో పార్టీని ప్రకటించారు. ఇక 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో విజయ్‌ సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

editor

Related Articles