థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో అమెరికన్ నటి జో శర్మ, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. మే 8న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆసక్తికరమైన కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, అనూహ్యమైన మలుపులు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా దర్యాప్తు జర్నలిస్ట్ రాధ పాత్రలో జో శర్మ నటనకు మంచి గుర్తింపు లభించింది. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ చిత్రం జూన్ 19 నుంచి లయన్స్‌గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, జియోటీవీ, టాటా ప్లే బింజ్ వంటి ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానుంది. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి వినోదాన్ని అందించనుంది.
- June 2, 2026
0
11
Less than a minute
You can share this post!
editor

