గుణశేఖర్‌కు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జన్మదిన శుభాకాంక్షలు..!

గుణశేఖర్‌కు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జన్మదిన శుభాకాంక్షలు..!

టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌కు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న కథాంశాలు, పౌరాణిక, చారిత్రక, సామాజిక చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన గుణశేఖర్ మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో 14 చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ తరం దర్శకుల్లో అనేక జానర్లలో సినిమాలు రూపొందించిన అరుదైన దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.

గుణశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ధీరజ్ అప్పాజీ, చందు రమేష్, జిల్లా సురేష్ పాల్గొన్నారు. 58 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు తనను అభినందించడం ఆనందంగా ఉందని గుణశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ సినీ జర్నలిస్టుల యోగక్షేమాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.

Related Articles