టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన ‘అగధ’ మూవీ

టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన ‘అగధ’ మూవీ

‘అగధ’ సినిమా టీజర్ విడుదలతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయని ఎం.ఎస్. రాజు తెలిపారు. విజువల్ వండర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మహాదేవి పాత్రలో కామాక్షి నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. టెక్నికల్ టీమ్, ఆర్టిస్టుల కృషితో ‘అగధ’ ఒక గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మూవీ టీమ్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Related Articles