“జీవితాలు మారిపోయాయి..” – ఐరాఖాన్

“జీవితాలు మారిపోయాయి..” – ఐరాఖాన్

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూతురు  ఐరా ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తల్లిదండ్రుల విడాకులు తర్వాత తమ జీవితాలు ఎంతో మారిపోయాయని, వారు విడిపోయినప్పుడు అంతలా బాధించలేదు కాని తర్వాత మానసికంగా ఎంతో కుమిలిపోయానని తెలిపారు. విడాకులు తీసుకోవడం అంత ఈజీ కాదన్నారు.

    అమీర్ ఖాన్ – రీనా దత్తా 1986లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఐరా మరియు జునైద్. 2002లో అమీర్ ఖాన్ దంపతులు విడాకులు తీసుకున్నారు. విడాకుల నిర్ణయం వల్ల తమ జీవితాల్లో మార్పు చాలా వచ్చిందని, మానసిక ఒత్తిడికి లోనయ్యామన్నారు. దాని వల్ల  థెరపిస్ట్ సలహాలు తీసుకోవల్సి వచ్చింది అన్నారు ఐరా. వారు విడిపోయినప్పటికీ మాతో ప్రేమగానే ఉన్నారు అని తెలిపారు. ఒత్తిడికి లోనైనపుడు  థెరపిస్ట్ సూచనలు తీసుకోవచ్చు అన్నారు ఆమె. ఇదే విషయమై అమీర్ కూడా తన కూతురు ఐరాతో జాయింట్ థెరపీని ప్రారంభించానని వెల్లడించారు.    

          రీసెంట్‌గా ఐరాఖాన్ అమీర్ ఖాన్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

editor

Related Articles