బాలీవుడ్ నటి ఛాయా కదమ్ వివాదంలో చిక్కుకుంది. ఆమె అడవి జంతువులైన మౌస్ డీర్, మానిటర్ లిజార్డ్, పోర్కుపైన్ మాంసం తిన్నట్లు ఆరోపణలు రావడంతో ఆమె చట్టపరమైన చిక్కుల్లో పడింది. ముంబైకి చెందిన ప్లాంట్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ (PAWS) అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఛాయా కదమ్ ఒక వీడియో ఇంటర్వ్యూలో ఈ జంతువుల మాంసం తిన్నట్లు చెప్పారని ఆరోపణలు వచ్చాయి. ఛాయా కదమ్ ఇటీవల కేన్స్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమాలో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తాను అడవి జంతువులైన మౌస్ డీర్, కుందేళ్ళు, అడవి పందులు, ఊడుములు, ముళ్లపందుల వంటి మాంసం తిన్నానని ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం ఈ అడవి జంతువులను తినడం చట్టవిరుద్ధంతో పాటు. శిక్షార్హమైన నేరం. అయితే ఛాయా చెప్పిన విషయం వివాదం కావడంతో జంతు హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (విజిలెన్స్) రోషన్ రాథోడ్ మాట్లాడుతూ, ఫిర్యాదును డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌కు పంపించామని, త్వరలో ఛాయా కదమ్‌ను విచారణకు పిలుస్తామని తెలిపారు.
- May 3, 2025
0
56
Less than a minute
Tags:
You can share this post!
editor

