దేవర-1 సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ కొరటాల శివ. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల డైరెక్షన్‌లో ఈ సినిమా రావడం ఎన్టీఆర్ కథానాయకుడిగా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టుని నమోదు చేసుకోవడమే కాకుండా రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత తారక్ ప్రస్తుతం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ ఉండగా.. కొరటాల శివ దేవర 2 కోసం వెయిట్ చేస్తాడా లేదా మరో కొత్త హీరోతో సినిమా చేస్తాడా అనే డిస్కషన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ మలయాళం స్టార్ హీరో కొడుకుతో ఒక సినిమా ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్‌లో మెహన్‌లాల్ కీలక పాత్ర పొషించాడు. అయితే మోహన్‌లాల్‌తో ఉన్న రిలేషన్‌తో అతని కొడుకు కోసం ఒక కథను రెడీ చేయబోతున్నాడు శివ. మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ గురించి పరిచయం అక్కర్లేదు. 2022లో వచ్చిన హృదయం సినిమాతో మంచి హిట్టును అందుకున్నాడు. ఇక ప్రణవ్‌ను దృష్టిలో పెట్టుకుని శివ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

- November 9, 2024
0
27
Less than a minute
Tags:
You can share this post!
administrator