‘కేశవ చంద్ర రమావత్‌’ (కేసీఆర్‌) 22న రిలీజ్..

‘కేశవ చంద్ర రమావత్‌’ (కేసీఆర్‌) 22న రిలీజ్..

జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న సినిమా ‘కేశవ చంద్ర రమావత్‌’ (కేసీఆర్‌). గరుడవేగ అంజి డైరెక్షన్ చేస్తున్నారు. అనన్య కృష్ణన్‌ కథానాయిక. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను నటుడు, దర్శకుడు ‘బలగం’ వేణు విడుదల చేశారు. ‘ఓ లంబాడీ యువకుడి నిజ జీవితం నుండి స్ఫూర్తిపొంది ఈ సినిమాను తెరకెక్కించాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిమాని కథగా అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’ అని సినిమా బృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, ధన్‌రాజ్‌, తాగుబోతు రమేష్‌, జోర్దార్‌ సుజాత, లోహిత్‌ కుమార్‌, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంభాషణలు: రాజ్‌కుమార్‌ కుసుమ, సంగీతం: చరణ్‌ అర్జున్‌, స్క్రీన్‌ప్లే, రచన, నిర్మాత: రాకింగ్‌ రాకేష్‌.

administrator

Related Articles