గేమ్‌ఛేంజర్‌ సినిమాలో అందంతో కియారా అద్వానీ మ్యాజిక్‌..

గేమ్‌ఛేంజర్‌ సినిమాలో అందంతో కియారా అద్వానీ మ్యాజిక్‌..

తెలుగు ఫ్యాన్స్‌కు పెద్దగా చెప్పవలసిన అవసరం లేని భామ కియారా అద్వానీ. ఈ భామ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న సినిమాల్లో ఒకటి రాంచరణ్‌  టైటిల్‌ రోల్‌లో పోషిస్తున్న గేమ్‌ఛేంజర్‌. శంకర్‌ ‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 9న లక్నోలో గేమ్‌ ఛేంజర్ టీజర్ గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. నవంబర్ 9న మూడు రాష్ట్రాలు 11 థియేటర్లలో సాయంత్రం 4:30 గంటల నుంచి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయని తెలియజేశారు. మరోసారి టీజర్‌ డేట్ గుర్తు చేస్తూ కియారా అద్వానీ లుక్ విడుదల చేశారు మేకర్స్‌. నీలం రంగు కాస్ట్యూమ్స్‌లో హొయలుపోతూ అందాలు ఆరబోస్తున్న లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.

ఈ సినిమాలో రాజోలు సుందరి అంజలి మరో ఫిమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని దిల్‌రాజు తెర‌కెక్కిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాకి ఎస్‌ థమన్ మ్యూజిక్‌.

administrator

Related Articles