హీరో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా వచ్చే వారంలో హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్రపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది. గతంలో ఏ సినిమాలో చూడనటువంటి సన్నివేశాలను చిత్రీకరించేందుకు బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నాడట. అన్నట్టు, ఈ సన్నివేశాల్లో బాలయ్యతో పాటు జగపతి బాబు, అలాగే విలన్ పాత్రధారి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

- March 9, 2025
0
44
Less than a minute
Tags:
You can share this post!
editor