తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. దీంతో ఇతర భాషల్లోని అగ్ర తారలు సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీపికా పదుకోన్, అనన్యపాండే, జాన్వీకపూర్ వంటి తారలు ఇప్పటికే తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడీ వరుసలో సోనాక్షి సిన్హా చేరింది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ సినిమాతో ఆమె తెలుగులో అరంగేట్రం చేస్తోంది. సుధీర్‌బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా సోనాక్షి సిన్హా లుక్‌ను విడుదల చేశారు. యాక్షన్, ఆధ్యాత్మిక, అతీంద్రియ అంశాల కలబోతగా ఓ సరికొత్త ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నామని, విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరుస్తాయని, ఈ నెల 10 నుండి సోనాక్షి సిన్హా షూటింగ్‌లో పాల్గొంటారని నిర్మాతలు తెలిపారు.

- March 9, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor