రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో రూపేష్, ఆకాంక్షసింగ్ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. పవన్‌ప్రభ దర్శకుడు. ఈ సినిమాలోని ‘ఏదో ఏ జన్మలోదో..’ అనే గీతాన్ని త్వరలో విడుదల చేయబోతున్నారు. ఇళయరాజా స్వరపరచిన ఈ గీతానికి కీరవాణి సాహిత్యాన్ని సమకూర్చడం విశేషం. దర్శకుడు ఈ పాట విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి. ఇళయరాజా బాణీకి ఎం.ఎం.కీరవాణి సాహిత్యాన్ని అందించడం, అది మా సినిమాలో పాట కావడం ఆనందంగా ఉంది. కీరవాణి ఇప్పటివరకు ఎన్నో పాటలు రాశారు.. కానీ ఇళయరాజా బాణీకి రాయడం ఇదే ప్రథమం. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది’ అన్నారు. అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, రాజ్ తిరందాసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, నిర్మాత: రూపేష్ కుమార్ చౌదరి.

- January 2, 2025
0
11
Less than a minute
You can share this post!
editor