తెలుగులో కవిన్‌ బ్లడీ బెగ్గర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌లోకి..

తెలుగులో కవిన్‌ బ్లడీ బెగ్గర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌లోకి..

బ్లడీ బెగ్గర్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. బ్లడీ బెగ్గర్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో తమిళంలో ప్రీమియర్ అవుతుండగా.. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చేసింది. బ్లడీ బెగ్గర్‌ తెలుగు వెర్షన్‌ ఇప్పుడిక ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు బ్లడీ బెగ్గర్‌ తెలుగు వెర్షన్‌ భారతీయేతర (ఇండియా బయట) ప్రేక్షకులకు సన్‌ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో అందరూ వీక్షించే అవకాశం వచ్చేసింది. ఇంకేంటి మరి బ్లడీ బెగ్గర్‌పై మీరూ ఓ లుక్కేయండి. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తొలి ప్రొడక్షన్ వెంచర్‌గా వచ్చిన బ్లడీ బెగ్గర్‌ మరి తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి జెన్‌ మార్టిన్‌ సంగీతం సమకూర్చారు.

editor

Related Articles