దృశ్యం 3 వచ్చేస్తోంది.. మరోసారి ఉత్కంఠకు సిద్ధమేనా?

దృశ్యం 3 వచ్చేస్తోంది.. మరోసారి ఉత్కంఠకు సిద్ధమేనా?

భారతీయ సినీ ప్రేక్షకులను ఉత్కంఠభరిత కథతో ఆకట్టుకున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీ మూడో భాగం ‘దృశ్యం 3’ ఈ నెల 18 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘దృశ్యం 2’ ఘటనల తర్వాత జార్జ్‌కుట్టి తన కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నట్లు కనిపిస్తాడు. అయితే గతంలో జరిగిన సంఘటనలు మరోసారి అతడిని వెంటాడుతాయి. అతడు రూపొందించిన సినిమా వెనుక ఉన్న నిజాలను వెలికితీయడానికి జర్నలిస్టులు ప్రయత్నించడం, కుమార్తె అంజూకు వచ్చిన వివాహ ప్రతిపాదన అనుమానాలకు దారితీయడం కథలో కీలక మలుపులు. పాత శత్రువులు కొత్త ప్రణాళికలతో రంగంలోకి దిగడంతో జార్జ్‌కుట్టి కుటుంబం మళ్లీ ప్రమాదంలో పడుతుంది. తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు జార్జ్‌కుట్టి చేసే పోరాటం, ఉత్కంఠభరిత మలుపులు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. థ్రిల్లర్ చిత్రాల అభిమానులకు ‘దృశ్యం 3’ మరో ప్రత్యేక అనుభూతిని అందించనుంది.

Related Articles