రామ్ చరణ్ ‘పెద్ది’పై చిరంజీవి ప్రశంసల వర్షం..!

రామ్ చరణ్ ‘పెద్ది’పై చిరంజీవి ప్రశంసల వర్షం..!

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆయన దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, అలాగే చిత్ర బృంద సభ్యులను అభినందించి వారికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. సినిమా విజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘పెద్ది’లో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పాత్ర కోసం చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్, భావోద్వేగభరిత నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బుచ్చిబాబు సానా తెరకెక్కించిన విధానం, కథనంలోని భావోద్వేగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే 350 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం రెండో వారంలోనూ బలమైన కలెక్షన్లను నమోదు చేస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచిన ‘పెద్ది’ రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles