బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ BSS12 లుక్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ BSS12 లుక్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి BSS12. మిస్టిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ చందు తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు బెల్లంకొండ బర్త్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ ఒకటి షేర్ చేశారు. కొండపైన అటవీ ప్రాంతంలో గాలులు, మంటల మధ్య రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న లుక్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. త్వరలోనే బిగ్ స్క్రీన్‌పై హై యాక్టేన్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఫీల్‌ అయ్యేందుకు రెడీగా ఉండండి.. అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ సినిమాలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే సంయుక్తా మీనన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన స్టైలిష్‌, ట్రెండీ లుక్ విడుదల చేశారు. సంయుక్తా మీనన్‌ ఇందులో సమీర పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

editor

Related Articles