ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించిన సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 ఏడీ. తెలుగులో ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా సిల్వర్ స్క్రీన్‌పై రికార్డు వర్షం కురిపించిన ఈ సినిమా ఇక టీవీలో సందడి చేసేందుకు రెడీ అయింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 12న జీ తెలుగులో సాయంత్రం 5:30 గంటలకు టెలివిజన్ ప్రీమియర్ కానుంది. కల్కి 2898 ఏడీ ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా తన హవా చూపిస్తోంది.
కల్కి 2898 ఏడీ మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటానీ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించారు.